📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురుద్రారంగ్రామాన్నిఅభివృద్ధిచేస్తాసర్పంచ్అభ్యర్థి రెడ్డిపల్లి స్వరూప యాదవరెడ్డి

రుద్రారంగ్రామాన్నిఅభివృద్ధిచేస్తాసర్పంచ్అభ్యర్థి రెడ్డిపల్లి స్వరూప యాదవరెడ్డి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్ పేటభూంపల్లి మండలం
దుబ్బాక నియోజకవర్గం.సిద్దిపేటజిల్లా
అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని రుద్రారం గ్రామ సర్పంచ్ పదవికి టీ.వి. రిమోట్ గుర్తుతో పోటీ చేస్తున్న రెడ్డిపల్లి స్వరూప యాదవరెడ్డి గ్రామ ప్రజలను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.బుధవారం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ“గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇస్తే రుద్రారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తాను. ప్రతి ఇంటి సమస్య, ప్రతి వ్యక్తి అభ్యర్థన నాకు ముందుగానే ప్రాధాన్యం” అని పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేశి పరిష్కరిం చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. “దుబ్బాక నియోజకవర్గ ప్రజల సహకారంతో రుద్రారం గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తాను. ప్రతి ఒక్కరూ టీ.వి. రిమోట్ గుర్తును చూసి తమ అమూల్యమైన ఓటును వేసి, నాకు భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఇవ్వాలి” అని స్వరూప యాదవరెడ్డి కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular