భూంపల్లిలోఅంబేద్కర్ఆశయాలపునరుద్ఘాటన.
మనప్రజాప్రతినిధి//అక్బర్పేట భూంపల్లిమండలం.డిసెంబర్6
జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, దళిత–బహుజనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా భూంపల్లి గ్రామంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినమ్రంగా నివాళులు అర్పించారు.తరువాత మాట్లాడిన చైర్మన్ వెంకటయ్య గారు“భారత స్వాతంత్య్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత–బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితంతాఅహర్నిశలు కృషి చేసిన మహానేత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆయన చూపిన సమానత్వ మార్గమే దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది” అని అన్నారు.కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, దళితబహుజన సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, యువతతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.
జై భీం
భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.

