📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమొగుడంపల్లి నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్సై కే. రాజేందర్ రెడ్డి

మొగుడంపల్లి నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్సై కే. రాజేందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip


మొగుడంపల్లి,డిసెంబర్ 1 (మనప్రజాప్రతినిధి)
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని శనివారం ఛిరాగ్‌పల్లి ఎస్సై కే. రాజేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ తనిఖీలో జహీరాబాద్ పట్టణ ఎస్సై సంగమేశ్వర్, పోలీస్ బృందం, అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి బి. మారుతి పాల్గొన్నారు.ఎస్సై కే. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూమొగుడంపల్లి మండలం పరిధిలోని అన్ని పంచాయతీల్లో సర్పంచ్, వార్డ్ సభ్యుల నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేసుకోవాలని సూచించారు.
అభ్యర్థులు మరియు కార్యకర్తలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని, నామినేషన్ కేంద్రానికి కార్యకర్తలు 100 మీటర్ల దూరంలోనే ఉండాలని స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ప్రజా ప్రతినిధులు తమతో పాటు ఇద్దరు సభ్యులు మాత్రమే రావాలని, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చిరాగ్‌పల్లి ఎస్సై కే. రాజేందర్ రెడ్డి ప్రజల సహకారంతో నామినేషన్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular