మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.సెంబర్18
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పల్లం గొల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం అసంపూర్తిగా ఉండటంతో విద్యార్థుల భద్రత, ఆరోగ్యాలపై తీవ్ర ఆందోళన నెలకొంది. స్కూల్ బిల్డింగ్‌కు తలుపులు, కిటికీలు, ప్లాస్టరింగ్ వంటి మౌలిక పనులు ఇప్పటికీ చేయకపోవడంతో భవనం నిరుపయోగంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు.మునుపటి హెచ్ఎం రామాంజనేయులు పర్యవేక్షణలో స్కూల్ భవన నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, మంజూరైన నిధులు సరిపోలలేదన్న కారణంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఆ భవనం కొంతమంది గ్రామవాసుల సొంత కార్యకలాపాలకు ఉపయోగపడుతున్న పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.వర్షాకాలంలో స్కూల్ ఆవరణ చెరువును తలపించేలా నీరు నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగి, పిల్లలకు డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు వస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా స్కూల్ ఆవరణలో ప్రహరీని పగలగొట్టి ఒక ఇంటి యజమాని సొంత ప్రయోజనం కోసం బోరు వేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ప్రహరీని తిరిగి పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటివరకు పనులు చేయకపోవడంతో సమస్య మరింత తీవ్రమైందని గ్రామస్తులు పేర్కొన్నారు.అదేవిధంగా స్కూల్ ఆవరణలో బావిని తలపించేలా ఒక పెద్ద గుంత ఉండి, అందులో మురికి నీరు నిలవడంతో క్రిమికీటకాలు పెరిగి పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. కొందరు గ్రామస్తులు స్కూల్ ప్రాంగణంలోనే గేదెలను కట్టివేయడం, అక్కడే ఆహారం అందించడం వల్ల దోమల సంఖ్య పెరిగి విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం పనిచేస్తున్న హెచ్ఎం మాట్లాడుతూ-నూతన స్కూల్ భవన నిర్మాణానికి ఎంత నిధులు మంజూరయ్యాయి, అవి ఎంతవరకు ఖర్చయ్యాయి అన్న పూర్తి వివరాలు మునుపటి హెచ్ఎం రామాంజనేయులుకే తెలుసని స్పష్టం చేశారు.న్యాయం జరిగే తీరు – అధికారులపై బాధ్యతఈ సమస్యపై న్యాయం జరిగే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
మండల విద్యాధికారి (MEO) ఆధ్వర్యంలో ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ చేసి వాస్తవ నివేదిక సమర్పించాలి.
స్కూల్ భవన నిర్మాణానికి మంజూరైన నిధులు–ఖర్చులపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి బాధ్యత నిర్ధారించాలి.
అక్రమంగా వేసిన బోరును సీల్ చేసి, పగలగొట్టిన ప్రహరీని వెంటనే పునరుద్ధరించాలి.
స్కూల్ ఆవరణలో నిలిచిన నీటిని తొలగించి ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు, పిల్లలకు హెల్త్ క్యాంప్ నిర్వహించాలి.
తలుపులు, కిటికీలు, ప్లాస్టరింగ్, డ్రెయినేజ్ వంటి పనులను స్పష్టమైన టైమ్‌లైన్‌తో పూర్తి చేయాలి.పనుల పురోగతిపై గ్రామస్థాయిలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసి పారదర్శకత కల్పించాలి.పిల్లల ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత అధికారులదే కాకుండా పాలకులదీ కూడా అని గ్రామ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. నిర్ణీత గడువులో స్కూల్ భవనం పూర్తి చేసి, సురక్షితవాతావరణంలో పిల్లలు చదువుకునేలా చర్యలు తీసుకుంటేనే ఈ సమస్యకు నిజమైన న్యాయం జరిగినట్టని తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు.
ఈబడిని పట్టించుకోండి… న్యాయం జరిగే తీరు-తల్లిదండ్రుల ఆవేదన
RELATED ARTICLES

