Friday, February 27, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్వాజపేయి శతజయంతి ఉత్సవాలకు విచ్చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

వాజపేయి శతజయంతి ఉత్సవాలకు విచ్చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//రేణిగుంట మండలం.డిసెంబర్15
వాజపేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విచ్చేసిన ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామీకి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్‌లకు కూడా ఎమ్మెల్యే బొజ్జల ఆత్మీయ స్వాగతం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోలా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామీని కలంకారి వస్త్రంతో సత్కరించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వాజపేయి శతజయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్న ఆకాంక్షను నేతలు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం ఘనంగా, ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular