Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుగ్రామంలో అధికారులు50మందికి పైగా…కానీ ప్రజలకు అందుబాటు ఎంత?

గ్రామంలో అధికారులు50మందికి పైగా…కానీ ప్రజలకు అందుబాటు ఎంత?

📰 Generate e-Paper Clip

దేశానికి పట్టు కొమ్మలు గ్రామాలు” అని మనం గర్వంగా చెబుతాం.
కానీ ఆ గ్రామాల్లో ప్రభుత్వ వ్యవస్థ నిజంగా ప్రజలకు సేవ చేస్తున్నదా?
లేదా కేవలం జాబితాల్లో మాత్రమే ఉందా? అన్న ప్రశ్నలు నేడు ప్రతి గ్రామంలో వినిపిస్తున్నాయి.ఒక సాధారణ గ్రామాన్ని తీసుకుంటే సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, కార్యదర్శి, వీఆర్‌ఓ, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేయర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, టీచర్లు, లైన్‌మన్, హెల్పర్లు, అగ్రికల్చర్ అధికారులు, ఐకేపీ సభ్యులు, పోలీస్ అధికారులు, రేషన్ డీలర్లు, మధ్యాహ్న భోజన సిబ్బంది… ఇలా లెక్కిస్తే దాదాపు 50 మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది ఒక గ్రామానికి సంబంధించినవారే.
అయితే అసలు ప్రశ్న ఇదే…ఈ అధికారులందరూ
▪️ ప్రతిరోజుగ్రామ సచివాలయానికి వచ్చి•సంతకం పెట్టి▪️వారి విధుల్లోకి వెళ్తున్నారా?ఎన్ని గ్రామాల్లో ఇది వాస్తవంగా జరుగుతోంది?
ప్రజలకు తెలియని అధికార వ్యవస్థ.
గ్రామంలో ఏ పని ఉన్నా ప్రజలు అయోమయంలో పడుతున్నారు.
ఎవర్ని కలవాలి?
ఏ అధికారికి ఆ పని సంబంధించినది?
ఆ అధికారి ఏ టైంలో ఉంటారు?
ఫోన్ నంబర్ ఏది?
ఇలాంటి ప్రాథమిక సమాచారం కూడా చాలా గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు.
గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో
❌ అధికారుల బాధ్యతల పట్టికలు లేవు
❌ ఫోన్ నంబర్ల బోర్డులు కనిపించవు
❌ దరఖాస్తు చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుందో చెప్పే సిటిజన్ చార్టర్లు లేవు.
ఉద్యోగులు ఉన్నారు… సేవ కనిపించడంలేదు
వ్యవస్థ ఉంది కానీ జవాబుదారీతనం లేదు.
సిబ్బంది ఉన్నారు కానీ అందుబాటు లేదు.
ప్రభుత్వం గ్రామంలో ఉంది కానీ ప్రజల దగ్గర కనిపించడంలేదు.
ఇన్ని శాఖలు ఉన్నా,
ప్రతి రోజు నిజంగా పని చేస్తున్న శాఖలు ఎన్ని?
ప్రజల సమస్యలకు స్పందిస్తున్న అధికారులు ఎంత మంది?
ఇది రాజకీయ విమర్శ కాదు
ఇది ఏ పార్టీపై విమర్శ కాదు.
ఇది ఏ వ్యక్తిపై ఆరోపణ కాదు.
👉 ఇది ప్రజల ప్రశ్న
👉 ఇది వ్యవస్థ పారదర్శకతపై డిమాండ్
గ్రామ సచివాలయాలు ప్రజలకు సేవా కేంద్రాలుగా మారాలంటే ప్రతి గ్రామంలో తప్పనిసరిగా
✔️ అధికారుల జాబితా
✔️ ఫోన్ నంబర్లు
✔️ పని సమయాలు
✔️సేవలపూర్తికాలపరిమితిప్రదర్శించాలి.ముగింపు గ్రామమే దేశానికి పునాది అంటాం.కానీ ఆ పునాదిలో పని చేయాల్సిన శాఖలు, అధికారులు నిజంగా పనిచేస్తున్నారా అనే ఆత్మపరిశీలన అవసరం.
50 మందికి పైగా సిబ్బంది ఉన్న గ్రామంలో…
ప్రజలకు అందుబాటులో ఎంత మంది ఉన్నారు?
👉 ఇదే నేటి గ్రామ భారతదేశం ఎదుర్కొంటున్న అసలు ప్రశ్న.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular