Friday, February 27, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్ఏఎంసీ డైరెక్టర్‌గా నియమితులైన కే.కే. భాగ్యలక్ష్మిని మర్యాదపూర్వకంగా TV4. ప్రజాప్రతినిధి.

ఏఎంసీ డైరెక్టర్‌గా నియమితులైన కే.కే. భాగ్యలక్ష్మిని మర్యాదపూర్వకంగా TV4. ప్రజాప్రతినిధి.

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్ 1
శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామానికి చెందిన కే.కే. భాగ్యలక్ష్మిమహిళా కోట కింద నియమితులయ్యారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డిఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమె నియామకం అధికారికంగా ప్రకటించింది.కేకే భాగ్యలక్ష్మి భర్త కేకే రమణ తెలుగుదేశం పార్టీకి కీలక నాయకుడిగా, రాజకీయంగా ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపులో కేకే రమణ చేసిన కృషి విశేషమైందని, ఆ కుటుంబం పార్టీ బలోపేతానికి చేసిన సేవలను గుర్తింపు చేస్తూ ఈ పదవి ఇవ్వబడినట్లు పేర్కొన్నారు.
డైరెక్టర్‌గా నియమితులైనసందర్భంగా TV4తెలుగున్యూస్.మనప్రజాప్రతినిధితెలుగుదినపత్రిక తరఫున తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారి రమేష్ ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
రిపోర్టర్ రమేష్ వ్యాఖ్యలు.“సామాజిక సేవాభావంతో పనిచేస్తున్న నాయకులను గుర్తించి ఇలాంటి బాధ్యతలు ఇవ్వడం అభినందనీయం. కే.కే. భాగ్యలక్ష్మి గారు ఈ పదవిని వృద్ధి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి వినియోగిస్తారని నమ్మకం” అని తెలిపారు.
ప్రజాప్రతినిధి తెలుగు దినపత్రిక తరఫున, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులు ఆమె దంపతుల జీవితంలో రావాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular