📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఆర్థికఇబ్బందులుతట్టుకోలేకరైతుఆత్మహత్యఉదయంలేచిచూసేసరికివిగతజీవిగాకనిపించినకనకరాజు

ఆర్థికఇబ్బందులుతట్టుకోలేకరైతుఆత్మహత్యఉదయంలేచిచూసేసరికివిగతజీవిగాకనిపించినకనకరాజు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాక.కుకునూరుపల్లిమండలం.డిసెంబర్5
కుకునూరుపల్లి మండలం మేదిన్‌పూర్ గ్రామానికి చెందిన బోయిన్ కనకరాజు (45) ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.
గ్రామంలోని 26 గుంటల భూమిపై వ్యవసాయం చేస్తూ జీవనం సాగించిన కనకరాజు, గత కొంతకాలంగా పంటలు సరిగా రాకపోవడం, పెట్టుబడులు సమకూర్చుకోలేక తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురై జీవితంపై విరక్తి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.బుధవారం రాత్రి ఇంట్లోఅందరు పడుకున్న సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం లేచి చూసే సరికి కనకరాజు విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. వెంటనే విషయం పోలీసులకు తెలియజేశారు.ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.