మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 02
కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ హరిత విద్యాలయ కార్యక్రమం కోసం చేపట్టిన సర్వేలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెళ్జీపూర్ జిల్లా స్థాయిలో మెరుగైన ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, విద్యాధికారి వినోద్ చేతుల మీదుగా పాఠశాలకు ప్రశంస పత్రం అందజేశారు.
జిల్లా వ్యాప్తంగా 650 పాఠశాలలు పాల్గొన్న ఈ ఎంపికలో, 9 నుండి 12వ తరగతి వర్గంలో వెళ్జీపూర్ జడ్పిహెచ్ఎస్ స్వచ్ఛ హరితవిద్యాలయగా నిలిచి గర్వకారణంగా నిలిచింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాట్నపెల్లి స్వామి రెడ్డి ప్రశంస పత్రం స్వీకరించారు.సర్వేలో పాఠశాల సాధించిన శాతాలు ఇలా ఉన్నాయి:
నీటి నిర్వహణ: 90.91%
మరుగుదొడ్ల నిర్వహణ: 88.89%
హ్యాండ్‌వాషింగ్: 100%
ఆపరేషన్ నిర్వహణ: 95.24%
ప్రవర్తనా మార్పు సామర్థ్యం: 85%
మిషన్ లైఫ్ విభాగం: 90.48%జిల్లా స్థాయిలో రెండు పాఠశాలలు మాత్రమే అత్యుత్తమ ర్యాంక్ సాధించగా, వాటిలో ఒకటిగా వెళ్జీపూర్ పాఠశాలు నిలవడం స్థానికులకు ఆనందకర విషయం.ఈ సదర్భంగా ప్రధానోపాధ్యాయులు స్వామి రెడ్డి మాట్లాడుతూ, ఈ విజయానికి కృషి చేసిన ఎకోక్లబ్ కో–ఆర్డినేటర్ అయ్యన్న గారి హరికృష్ణ రెడ్డిని ప్రశంసించారు. వారి కృషి పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
స్వచ్ఛ హరిత విద్యాలయంగా వెళ్జీపూర్ జడ్పిహెచ్ఎస్ ఎంపిక
RELATED ARTICLES

