📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగ్రామఅభివృద్ధే లక్ష్యం:ఇంటింటాప్రచారంచేసిన బొమ్మ మల్లయ్య

గ్రామఅభివృద్ధే లక్ష్యం:ఇంటింటాప్రచారంచేసిన బొమ్మ మల్లయ్య

📰 Generate e-Paper Clip

ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా : సర్పంచ్ అభ్యర్థి బొమ్మ మల్లయ్య
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్15 గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బొమ్మ మల్లయ్య ప్రచారం చివరి రోజున ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిశారు. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
గ్రామంలో మార్కెట్ యార్డ్ నిర్మాణం, మోరీల పునరుద్ధరణ, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను ప్రాధాన్యతగా చేపడతానని హామీ ఇచ్చారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఫుట్‌బాల్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను నేరుగా కలసి ప్రచారంనిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.