Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలువిద్యారంగానికి అంకిత సేవలకు ఘన సన్మానం.ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది-బక్కి వెంకటయ్య

విద్యారంగానికి అంకిత సేవలకు ఘన సన్మానం.ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది-బక్కి వెంకటయ్య

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్–భూంపల్లి మండలం.సిద్దిపేట జిల్లా
దుబ్బాక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పీఎస్‌హెచ్‌ఎం‌గా సుదీర్ఘకాలం సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న శ్రీమతి కోట సక్కుబాయి గారిని పద్మశాలి భవన్, దుబ్బాకలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య శాలువాతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడు తూ“సక్కుబాయి గారి సేవలు, మార్గదర్శకత్వం అనేక మంది విద్యార్థుల జీవితాలను మలిచాయి. ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనది; ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి ఉపాధ్యాయులదే” అని ప్రశంసించారు.అనంతరం సక్కుబాయి గారు చైర్మన్ వెంకటయ్యను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చైర్మన్‌తో పాటు దుబ్బాక సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్, భూంపల్లి గ్రామ సర్పంచ్ రంగయ్య గారి జన్నారెడ్డి, దుబ్బాక మున్సిపల్ మాజీ చైర్మన్ భూమిరెడ్డి, గంభీర్పూర్ సర్పంచ్ బాణాల శ్రీనివాస్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన సక్కుబాయి గారి సేవలకు అందరూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular