Monday, April 20, 2026
ads
Homeతెలంగాణసరిహద్దు వీరుడికి ఘన నిరాజనం జవాన్ కాళ్ళు కడిగిన రాపోలు నవీన్ కుమార్

సరిహద్దు వీరుడికి ఘన నిరాజనం జవాన్ కాళ్ళు కడిగిన రాపోలు నవీన్ కుమార్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి// నేరేడుచర్ల:

దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి భారత సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గరిడేపల్లి మండలం కల్మల్ చెర్వు గ్రామంలో ఒక అరుదైన, భావోద్వేగపూరిత సంఘటన చోటుచేసుకుంది. దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికుల పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటూ రాపోలు నవీన్ కుమార్, స్థానిక సైనికుడు వట్టే దశరద్ యాదవ్ కాళ్ళు కడిగి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ.. మంచుకొండల్లో, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో యుద్ధం చేస్తూ, దేశ రక్షణే పరమావధిగా బతుకుతున్న ప్రతి జవాన్ భరతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు.ఆసేతు హిమాచలం వరకు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్లందరికీ సైనిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్న సైనికులకు గౌరవం ఇవ్వడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు.దేశభక్తిని చాటుతూ సైనికుడిని గౌరవించిన నవీన్ కుమార్ తీరును గ్రామస్తులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular