మునిపల్లి జనవరి 12 (మనప్రజాప్రతినిధి)
సోమవారం రోజు ఉదయం అందాజా ఆరు గంటల సమయంలో జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్ళుచున్న రోడ్డుపై హోటల్ వే వెయిట్ దాటిన కొద్ది దూరంలో ముందు వెళ్తున్న ట్యాంకర్ ను వోక్స్వ్యాగన్ కార్ No.AP28 BR 5905 గల దాని డ్రైవర్ కిషోర్ తన కారును మద్యం మత్తులో ఉండి అతివేగంగా జాగ్రత్తగా నడిపి ముందు వెళ్తున్న ట్యాంకర్ వెనుక భాగంలో తగిలి కారు ఉండగా ఇంకా వెనకనుంచి వచ్చిన భారీ కంటైనర్ కారును తప్పించడంలో డివైడర్ పై దూసుకొనెల్లి ఆగింది. ఇట్టి ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ట్యాంకర్ మరియు కంటైనర్ డ్రైవర్లు కారు డ్రైవర్లు రాజీపడి వెళ్ళిపోయినారు. పోలీస్ స్టేషన్లో ఎలాంటి దరఖాస్తు ఇయ్యలేదు. కారు యొక్క డ్రైవర్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 136 వచ్చింది. కార్ డ్రైవర్ పై డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు అయినది అని మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తెలిపినారు.
లింగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
RELATED ARTICLES

