మనప్రజాప్రతినిధి//కామారెడ్డి.జనవరి8
కామారెడ్డి పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.శిశుమందిర్ స్కూల్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి, చౌరస్తా వద్ద ట్రాఫిక్ నిబంధ నలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వా న్ మాట్లాడుతూ, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందని, రోడ్డు ప్రమాదా లు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, త్రిబుల్ రైడింగ్ చేయడం చట్టవిరుద్ధమన్నారు. వాహనాల వేగాన్ని తగ్గించి, సరైన మార్గంలో ప్రయాణించాలని తెలిపారు.ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై మహేష్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, ఇతర పోలీస్ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
RELATED ARTICLES

