సదాశివపేట్:మనప్రజాప్రతినిధి//జనవరి12.ఆత్మకూరు గ్రామంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆత్మకూరు యువజన సంఘం సభ్యులు ఘన నివాళులు అర్పించారు. గత 20 సంవత్సరాలుగా ఈ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కార్యక్రమంలో స్వామి వివేకానంద విగ్రహానికి అభిషేకం చేసి, పూలమాలలతో అలంకరించి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు.
ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించబడుతుంది. స్వామి వివేకానంద 1863 జనవరి 12న జన్మించారు. ఆయన ఆలోచనలు, సూత్రాలు, ఆదర్శాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈ వేడుక ద్వారా యువతలో దేశభక్తి, ఆత్మవిశ్వాసం, సంకల్పం, ధైర్యం, సృజనాత్మకతను పెంపొందించడానికి ప్రేరణ కల్పించడం లక్ష్యంగా ఉంది.ఈ కార్యక్రమంలో చిరంజీ చరణ్ సింగ్, గందే రాజు, అయ్యగారి బసవలింగం, ఎదుల బసవరాజ్, కపిల శివకుమార్, పవన్ సింగ్, కవెల్లి కిరణ్ సింగ్, అంతారం జగదీశ్వర్, కొండాపురం విశ్వనాథ్, నీరట్ నగేష్, రాపోలు రమేష్, దర్జీ సాయి ప్రసాద్, కల్లపల్లి సూరిబాబు, కపిల వీరేశం తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై స్వామి వివేకానందకు గౌరవాన్ని అర్పించారు.సమారంభ ప్రతినిధులు పేర్కొన్నారు – “ఈ కార్యక్రమం ద్వారా యువతలో సేవా భావన, సానుకూల ఆలోచనలు, దేశాభిమానం పెంపొందించడమే ముఖ్య లక్ష్యం.”
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆత్మకూరు యువజన సంఘం ఘన నివాళి
RELATED ARTICLES

