•భూంపల్లిలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా-విగ్రహానికి పూలమాలలతోనివాళులు
తెలంగాణరాష్ట్రఎస్సీ,ఎస్టీకమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య.
మనప్రజాప్రతినిధి//అక్బర్పేట్.భూంపల్లి మండలం.జనవరి3.
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి, మహోన్నత సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని అక్బర్పేట్ భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భూంపల్లి గ్రామంలో ఉన్న సావిత్రి బాయి పూలే విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘ సంస్కర్త, రచయిత్రిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపో యారని అన్నారు. ఆమె జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సావిత్రిబాయి పూలే కలలు కన్న ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఆమె చూపిన మార్గదర్శకత్వంలో భారత మహిళలు విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలోభూంపల్లి సర్పంచ్ రంగయ్య గారి జన్నారెడ్డి, ఉపసర్పంచ్ బాల్శెట్టి అనూష నందం, వార్డు సభ్యులు లక్ష్మి నర్సవ్వ, మాధురి, ప్రవీణ్, శ్రీకాంత్, కొండల్, అనిల్, బాలరాజు, రంజిత్, రాజు గౌడ్, శ్రీధర్, అక్బర్పేట్ సర్పంచ్ మండల కుమార్, మోతే మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ఉమారాణి బాలగౌడ్, ఉల్లెంగల నవ్య–నరేష్, నాయకులు బోయ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పూలే కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కుటుంబీకులు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

