•ఇరుకోడు గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం
సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//జనవరి9.
సిద్దిపేట జిల్లా రూరల్ పరిధిలోని ఇరుకోడు గ్రామంలో నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ సుడా చైర్మెన్ మారెడ్డి రవీందర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మారెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడు తూ, గత రెండు సంవత్సరాల కాలంగా గ్రామంలో సర్పంచ్ లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని తెలిపారు. అయితే గత స్థానిక ఎన్నికలలో ప్రజల మద్దతుతో గెలుపొందిన గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించి న తర్వాత గ్రామంలో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయని అన్నారు.గ్రామంలో గతంలో మరుగున పడిన నల్లాలు, మినీ ట్యాంకు లు, డ్రైనేజీ వ్యవస్థలు, కాలువలను సక్రమంగా పునరుద్ధరిస్తూ అభివృద్ధి దిశగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనిప్రశంసించారు. సమిష్టి కృషితో గ్రామంలో నిలిచిపోయిన వ్యవస్థలను తిరిగి ప్రాణం పోస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు.అలాగే గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఇరుకోడు గ్రామంలో నూటికి 90 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేసి, కేంద్ర.రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు సాధించామని గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ తరఫున సర్పంచిగా గణపురం కృష్ణ గెలుపొందడంతో అభివృద్ధి పనులు మరింత శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.ప్రస్తుతం గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతులు వంటి మౌలిక సదుపాయాలు నూటికి 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కూడా గ్రామాభివృద్ధి ఆగకుండా కొనసాగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండాలని హితవు పలికారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతులను సక్రమంగా వినియోగించుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వ, గ్రామ పాలకవర్గం వార్డ్ సభ్యులు, మాజీ ఎంపీటీసీ చిట్యాల సత్యనారా యణ గౌడ్, గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇరుకోడులో అభివృద్ధికి పరుగులు – సీసీ రోడ్డు ప్రారంభం
RELATED ARTICLES

