మొగుడంపల్లి,జనవరి22(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో రాయితీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మక్సుద్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి డి. మహేష్, స్థానిక సర్పంచ్ బి. రాజు, మండల వ్యవసాయ అధికారి అస్నుద్దీన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి బి. మారుతి,సి. బక్కయ్య, బి. ప్రేమ్ కుమార్, ఆలూరి కృష్ణ, మొహమ్మద్ ఖాన్, పి. ప్రేమ్ కుమార్, కే. కిష్టయ్య,స్థానిక వార్డు సభ్యుడు రఫీ,జి.మహేష్, ఏ.విటల్, శేఖర్ గౌడ్, ఎస్. రాజు,పడ్యాలు తాండ సర్పంచ్ వాచ్‌దేవ్,మంద గుబ్బడి తాండ సర్పంచ్ గోవింద్ నాయక్,మిర్జాపల్లి తాండ సర్పంచ్ సుభాష్,ఉప సర్పంచ్ రమేష్ రాథోడ్,ఇప్పపల్లి సర్పంచ్ నాగిశెట్టి,మండలంలోని వివిధ గ్రామాల రైతులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మక్సుద్మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తోందని కొనియాడారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మొగుడంపల్లి రైతు వేదికలో రాయితీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ
RELATED ARTICLES

