Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణచండ్రుపట్ల సొసైటీలో రైతులు ఆందోళన

చండ్రుపట్ల సొసైటీలో రైతులు ఆందోళన

📰 Generate e-Paper Clip

యూరియా అంధకా రైతులు గందరగోళం
గత 20 రోజుల నుండి యూరియా అంధక చేతికొచ్చిన పంట నాశనం అవుతుందని రైతుల ఆవేదన.

ప్రజాప్రతినిధిన్యూస్//కల్లూరు జనవరి 27

కల్లూరు మండల పరిధి చండ్రుపట్ల  గ్రామ సొసైటీ పరిధిలో గల రైతులకు తక్షణమే యూరియా కట్టలు ఇవ్వాలి అంటూ సొసైటీ ముందు ధర్నా చేయటం జరిగింది  మా గ్రామంలో ఉన్న రైతులకు  ఇవ్వకుండా పక్క గ్రామంలో సుమారు ఎనిమిది వందల ఎకరాల మాత్రమే సాగులో ఉన్న రైతులకు  రైతులకు ఇస్తున్నారు అంటూ రైతు వేదకలు లో   సుమారు 30 రోజులుగా యూరియా కట్టల కోసం కార్డులను రాసి ఇచ్చి ఇప్పటివరకు ఒక్క యూరియా కట్టను అందించలేదు అంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు   చండ్రుపట్ల  గ్రామ రెవెన్యూ పరిధిలో గల సుమారు 4000 ఎకరాల భూమి సాగు చేస్తున్న రైతులు పంట చివర దశగా ఉండటంతో ఇట్టి సమయంలో  యూరియా అందకపోవడంతో నష్టం జరిగే అవకాశం ఉందంటూ ఈ సమస్యను గుర్తించి తక్షణమే అధికారులు రైతులకు సరిపడ  యూరియా వచ్చే విధంగా చేయాలని సంబంధిత అధికారులను  కోరుతున్న చండ్రుపట్ల  రైతులు. ఈ కార్యక్రమంలో చండ్రుపట్ల గ్రామ రైతులు ,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular