షాపుల్లో లేని యూరియా యాప్ లో దొరుకుతుందా
నంగునూరు జనవరి 9 మన ప్రజా ప్రతినిధి
సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మేట లో ఆయిల్ పామ్ ప్యాక్టరీ నీ సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు సిద్దిపేట నియోజక వర్గం పూర్తి స్థాయిలో నూనె ఉత్పత్తిని ప్రారంభించింది అని
మాజీ సీఎం కేసీఆర్ కలలు నేడు నిజమైన సందర్బంగా చాలా ఆనందంగా ఉంది అన్నారు రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిందనికరోనా వచ్చిన కూడా కెసిఆర్ రైతు బంద్ అపలేదు అని రైతులకు నీళ్ల బాధ లేకుండా చేశారు అని కేసీఆర్ బిస్కెట్స్ తరహాలో ట్రాన్స్ఫార్మర్ పంచి పెట్టాడు అని కేసీఆర్ హయాంలో ఎరువుల కొరత లేకుండా వ్యవసాయాన్ని అద్భుతంగా తీర్చి దిద్దారుఅన్నరురెండేళ్ల కాంగ్రెస్ అలనలో వ్యవస్త అస్తవ్యస్తమైంది కాంగ్రెస్ పాలనలో కరెంట్ 12గంటలకు మించి రావడం లేదని కాంగ్రెస్ యూరియా కోసం యాప్ లు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతుంది అన్నారురేవంత్ రెడ్డి రెండు పంటలకు రైతు బంద్ ఎగొట్టాడు, వానకాలం పంట 600కోట్ల బోనస్ పెండింగ్ పెట్టింది.
రెండేళ్ల లో ఒక్క గజం కాళేశ్వరం కాలువ తవ్వలేదు, 5కోట్లు ఖర్చు చేస్తే కాలువల ద్వారా మూడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు, కావాలని రేవంత్ రెడ్డి రైతుల పై కక్షగట్టి పనిచేస్తున్నాడు అన్నారు హస్తం గుర్తు కాస్త మొండి హస్తం అయింది అన్నరు. బి ఆర్ యాస్ అయంలో 25మార్చి 2021లో ఆయిల్ పామ్ ప్యాక్టరీ పెట్టడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుని జూన్ 5, 2021లో అశ్వారావు పేట నుండి ఆయిల్ పామ్ మొక్కను తెచ్చి ఇక్కడ నాటము. నేడు జిల్లాలో 14075ఎకరాల ఆయిల్ పామ్ తోట కొనసాగుతుంది. నర్మేట లో 65ఎకరాల్లో 300కోట్లతో 13ఏప్రిల్ 2022లో ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశామని ఇప్పటి వరకు 3500గేలలను క్రషింగ్ చేస్తున్నాం
సిద్దిపేట కు గోదావరి జలాలు 40 ఏండ్ల కల అని సిద్దిపేట జిల్లాలో 8వేల ఎకరాల నుండి 80వేల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పెరిగింది ఈ సందర్భంగా తెలిపారు త్వరలోనే రిఫైనరీ ప్రారంభించాలని డిమాండ్ చేసారు.

