Friday, February 27, 2026
ads
Homeతెలంగాణఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు

ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

-ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య

మనప్రజాప్రతినిధి//జనవరి 08 సునీల్

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో లూయిస్  బ్రెయిలీ 217 వా జయంతి వేడుకలు బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ అంజయ్య మాట్లాడుతూ  ఈ లైబ్రరీలో భారతీయ భాషల స్కాన్ అండ్ రీడ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు దీని ద్వారా విజువల్లి ఛాలెంజ్ విద్యార్థులు ముద్రత పుస్తకాలను నేరుగా స్కాన్ చేసి చదవగలరని చెప్పారు ఆఫ్లైన్లతో పాటు గూగుల్ ఏఐ ఆధారిత ఆన్లైన్ విధానాలు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. దృష్టిలోపం గల వారి వినియోగానికి అనుగుణంగా 10 ఏంజెల్ ప్లేయర్లు డీజీ ప్లేయర్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు వీటి ద్వారా స్కాన్ చేసిన పుస్తకాలు ఫైల్లు పిడిఎఫ్ ఫార్మాట్ లో ఉన్న పుస్తకాలను కాపీ చేసి వినియోగించుకోవచ్చని కంప్యూటర్ అవసరం లేకుండానే తెలుగు హిందీతో తదితర భారతీయ భాషల పుస్తకాలను ఆడియో రూపంలో తినే సౌకర్యం ఉందని భారతీయ యాసతో స్పష్టంగా చదివే విధానం ఈ లైబ్రరీ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుందన్నారు అలాగే బ్రెయిన్ ప్రింటింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇంగ్లీష్ లేదా తెలుగు భాషల్లో ఉన్న పుస్తకాలను పిడిఎఫ్ లేదా ముద్రిత రూపంలో బ్రెయిలీ లిపిలోనికి మార్చి ముద్రించడం ద్వారా దృష్టిలోపం గల వారికి బ్రెయిలీ లిపి ద్వారా సులువుగా చదవగలరని వివరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆలోచన మేరకు ఈ సౌండ్ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు సద్వినియోగం చేసుకున్నప్పుడే ఫలితం ఉంటుందని పేర్కొన్నారు ప్రభుత్వం సహకారంతో దివ్యాంగులు మరింత ముందుకు సాగాలని ఆకర్షించారు. అంతకు ముందు లూయిస్ బ్రెయిలీ 20017వ జయంతి వేడుకలు నిర్వహించి ప్రత్యేక క్యాలెండర్ను ఆవిష్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular