Friday, April 17, 2026
ads
Homeతెలంగాణఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.ఏ ఖైసర్

ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.ఏ ఖైసర్

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్, జనవరి 27:


ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ అబ్దుల్ ఖైసర్‌ను నియమిస్తున్నట్లు ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు తెలిపారు. బషీరాబాద్‌లోనిర్వహించినఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి–2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ నియామకాన్ని ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నవోదయ సిద్దు మాట్లాడుతూ, మానవ హక్కుల పరిరక్షణలో ఖైసర్ సేవలు ప్రశంసనీయమని, సామాజిక సేవా రంగంలో ఆయనకు ఉన్న అనుభవాన్ని గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. జిల్లాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బాధితులకు న్యాయం అందేలా కృషి చేయాలని సూచించారు.కొత్త బాధ్యతలు స్వీకరించిన ఖైసర్ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి సంస్థ చైర్మన్ నవోదయ సిద్దు, రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి లక్ష్యాల సాధన కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలో సంస్థను మరింత బలోపేతం చేస్తానని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular