Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుకళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ..

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ..

📰 Generate e-Paper Clip

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-మంత్రి దామోదర్ రాజనర్సింహ

నాగులపల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం-మంత్రి దామోదర్ రాజనర్సింహ
సదాశివపేట,జనవరి20(మనప్రజాప్రతినిధి):
నాగులపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.నాగులపల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి శివానంద్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన లబ్ధిదారులు కర్కాని పూలమ్మ, వడ్ల నాగలక్ష్మి, పెద్ద జోగు పుణ్యమ్మలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి శివానంద్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. మహిళల ఆర్థిక భద్రతకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రామ్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, ఉప సర్పంచ్ పద్మారావు, పెద్ద జోగు ప్రభు, కర్కాని మల్కయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular