Saturday, January 10, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్పాలనలోనే కాదు… క్రీడల్లోనూ నాయకత్వం చూపిన ఎమ్మెల్యే బొజ్జల

పాలనలోనే కాదు… క్రీడల్లోనూ నాయకత్వం చూపిన ఎమ్మెల్యే బొజ్జల

📰 Generate e-Paper Clip

ప్రజలతో మమేకమైన నాయకుడు… క్రికెట్ మైదానంలోకి దిగిన ఎమ్మెల్యే బొజ్జల
శ్రీకాళహస్తి,జనవరి10(మనప్రజాప్రతినిధి):
శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాలనలోనే కాదు… క్రీడల్లోనూ నాయకత్వం చాటారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కాలేజ్) ప్రాంగణంలో నిర్వహించిన బొజ్జల క్రికెట్ టోర్నమెంట్ – సీజన్ 2ను ఆయన ఘనంగా ప్రారంభించారు.
ఈ టోర్నమెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ప్రత్యక్ష పాల్గొనడం. తానే స్వయంగా మైదానంలోకి దిగి బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ యువతను ఉత్సాహ పరిచారు. ప్రజలతో మమేకమైన నాయకుడిగా మరోసారి గుర్తింపు పొందారు.ప్రారంభ మ్యాచ్‌లో బొజ్జల టీమ్, శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ టీమ్‌తో స్నేహపూరితంగా తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా రాణించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన జట్టును విజయంలో నిలిపి మెన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు.
మ్యాచ్ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రీడలు క్రమశిక్షణను అలవర్చడంతో పాటు జీవన లక్ష్యాలను సాధించేందుకు దోహదపడతాయని తెలిపారు. మ్యాచ్ పూర్తయ్యే వరకు గ్రౌండ్‌లోనే ఉండి ప్రతి ఆటగాడిని ప్రోత్సహించారు.తదుపరి మ్యాచ్‌ల్లో శ్రీకాళహస్తి పోలీస్ టీమ్, ఉపాధ్యాయుల టీమ్‌లు పాల్గొనగా, వాటిని కూడా ఎమ్మెల్యే దగ్గరుండి వీక్షించారు. ఈ టోర్నమెంట్ యువత–ప్రజాప్రతినిధి మధ్య అనుబంధాన్ని మరింత బలపరిచే వేదికగా మారిందని క్రీడాభిమానులు ప్రశంసించారు.బొజ్జల క్రికెట్ టోర్నమెంట్ – సీజన్ 2, శ్రీకాళహస్తి యువతకు క్రీడల్లో ఉన్న అవకాశాలను గుర్తు చేస్తూ, సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular