•కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆవుల రాజిరెడ్డి
మనప్రజాప్రతినిధి//నర్సాపూర్.జనవరి9
మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి (నడిమి తండా) గ్రామ సర్పంచ్ కేతావత్ రాములు నాయక్ గారు నేడు నర్సాపూర్ నియోజక వర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి గారి సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి గారు రాములు నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసంక్షేమ కార్యక్రమా లు, అభివృద్ధి దృక్పథం పట్ల ఆకర్షితులై రాములు నాయక్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి గారు అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామస్థులందరితో కలిసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన నడిమి తండా గ్రామ సర్పంచ్ కేతావత్ రాములు నాయక్.
RELATED ARTICLES

