మనప్రజాప్రతినిధి//మిర్యాలగూడ,జనవరి10:
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ నందు నల్గొండ ఎస్పి శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో నిర్వహించిన నో హెల్మెట్ – నో పెట్రోల్ కార్యక్రమం లో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, డీఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలలో ప్రయాణం చేసే వారు హెల్మెట్ ధరించడం ద్వారా వారి ప్రాణాలతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా కాపాడినవారు అవుతారని అన్నారు. హెల్మెట్లు ధరించడం ద్వారా కాలుష్యం నుంచి కూడా మనని మనం రక్షించుకోవచ్చు, కావున నేటి నుంచి పెట్రోల్ బంక్ లలో హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయకుండా పకట్బందిగా కట్టడి చేయడం జరుగుతుందని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దాదాపు అయిదు వందల మంది ద్విచక్ర వాహనదారులకు బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్లు పంపిణీ చేసి, అనంతరం ద్విచక్ర వాహనదారులు అందరితో కలిసి హెల్మెట్లు ధరించి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ పోలీస్ సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

