సదాశివపేట,జనవరి 12(మనప్రజాప్రతినిధి):
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సదాశివపేటలోని వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…స్వామి వివేకానంద 1863 జనవరి 12న జన్మించార ని, ఆయన ఆలోచనలు, ఆదర్శాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం గా నిలుస్తున్నాయని అన్నారు. యువతలో సంకల్పం, ధైర్యం, సృజనా త్మకత పెంపొందించడమే లక్ష్యంగా ఆయన జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే సమాజంలో గొప్ప మార్పు సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటేశం,
సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ,మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం,
కాంగ్రెస్ నాయకులు నాగరాజు గౌడ్, శంకర్ గౌడ్, గుండు రవి, రాయిపాడ్ రమేష్, రాములు గౌడ్, లడ్డు, సజ్జి తదితరులు పాల్గొన్నారు.
వివేకానంద జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
RELATED ARTICLES

