Friday, March 20, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుపార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధే ధ్యేయం -ఆవుల రాజిరెడ్డి.

పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధే ధ్యేయం -ఆవుల రాజిరెడ్డి.

📰 Generate e-Paper Clip

నర్సాపూర్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి సూచన.మనప్రజాప్రతినిధి//నర్సాపూర్.జనవరి8
:సర్పంచుల ఫోరం నూతన జిల్లా ఉపాధ్యక్షురాలిగా, వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా ఎన్నికైన సంధ్య రామకృష్ణ రావును సన్మానించిన సందర్భంగా నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన సర్పంచులు సమన్వయంతో పని చేస్తూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా నిలుస్తోందని, ఆ పార్టీ తరఫున సర్పంచులుగా గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేస్తూ, ప్రజా క్షేత్రంలో సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు.గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అంకితభావంతో పనిచేయాలని, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపాలని సర్పంచులకు ఆవుల రాజిరెడ్డి హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, సంధ్య రామకృష్ణ రావు, కాంగ్రెస్ మహిళా నాయకురాలు టైగర్ ముక్తా భాయి, హస్తల్పూర్ మాజీ ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, తలారి మల్లేష్, పోతిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుర్గా గౌడ్, గోపియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular