📄 ePaper
Thursday, July 2, 2026
Homeఆంధ్రప్రదేశ్శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సందడి మధ్య ఘనంగా అభిషేక కార్యక్రమం.

శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సందడి మధ్య ఘనంగా అభిషేక కార్యక్రమం.

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి8
తిరుపతి జిల్లా ఏర్పేడు మండల పరిధిలోని గుడిమల్లం గ్రామంలో వెలసిన చారిత్రాత్మక శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయంలో గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వేదమంత్రోచ్ఛారణలు, శివనామస్మరణల మధ్య స్వామివారికి పంచామృతాలు, జలాభిషేకం, రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తలగిరి నాయుడు, ఆలయ ఈవో రామచంద్ర రెడ్డి, ప్రధాన అర్చకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది సమన్వయంతో అభిషేకాలు సజావుగా సాగాయి.గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకం అనంతరం అలంకారంలో దర్శనమిచ్చిన దక్షిణామూర్తి స్వామివారి రూపం కనుల పండుగగా ఉందని భక్తులు కొనియాడారు. ఆలయంలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular