మనప్రజాప్రతినిధి//వెల్దుర్తి:
వెల్దుర్తి మండలంలోని పెద్దాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసినట్లు తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం గ్రామంలో పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ రాహుల్ రాజ్ గారి ఆదేశాల మేరకు పెద్దాపూర్ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. గ్రామంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ప్రధానంగా భూములకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. బర్త్ సర్టిఫికెట్ లేనివారు మీ సేవలో అప్లై చేసుకోవాలని సూచించారు. వెంటనే బర్త్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రతి శుక్రవారం పెద్దాపూర్ గ్రామాన్ని సందర్శిస్తామని తెలిపారు. క్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ ఆర్ ఐ నర్సింగ్ యాదవ్ గ్రామ సర్పంచ్ రంగారెడ్డి ఉప సర్పంచ్ లావణ్య రాజు వార్డ్ నెంబర్ దాసరి అభిలాష్ గ్రామ పెద్దలు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

