మన ప్రజాప్రతినిధి/ఏర్పేడు మండలం తేదీ 09 జనవరి
దుర్గి పేరి ఏర్పేడు మండల కేంద్రంలోని ఎంపీ యూపీ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. పాఠశాల ఆవరణలో శుక్రవారం విద్యార్థినిలు ఎంతో ఉత్సాహంగా ముగ్గులు వేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ. సాంస్కృతి సాంప్రదాయాలను చాటే విధంగా అందమైన డిజైన్లు వేయడం జరిగింది. చిన్నారులకు భోగి పండ్లు పోసి, భోగి మంటలు వేశారు, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మకతను వెలికి తీయాలనే లక్ష్యంతో, సాంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వారికి అందించాలని లక్ష్యంలో భాగంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అందరూ అదే విధంగా విద్యార్థినీ విద్యార్థులు ఆనందంగా పాల్గొనడం జరిగింది.

