Friday, February 27, 2026
ads
Homeతెలంగాణవైన్ షాప్ నిర్మాణంపై నిరసనప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతి

వైన్ షాప్ నిర్మాణంపై నిరసనప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి
రాజన్న సిరిసిల్ల
జనవరి ,12

కొనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామంలో  గ్రామ దేవత దుర్గమ్మ ఆలయ పవిత్రతను కాపాడాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు
గ్రామ శివారులోని ఎస్సీ కాలనీ వద్ద ఉన్న దుర్గమ్మ ఆలయానికి సమీపంలో, కొత్తగా టెండర్ దక్కించుకున్న వైన్ షాప్ నిర్వాహకులు మద్యం దుకాణం ఏర్పాటు కోసం గదులను నిర్మిస్తున్నారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఆలయ పరిసరాల్లో మద్యం షాపును ఏర్పాటు చేయడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.నిత్యం పూజలతో కళకళలాడే దుర్గమ్మ ఆలయం వద్ద వైన్ షాప్ వస్తే భక్తులకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆలయ సమీపంలో వైన్ షాప్‌కు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని లేదా ఇతర ప్రాంతానికి తరలించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మెరుగు చందు, ఎర్ర ఆంజనేయులు, పల్లె వినోద్, పల్లె పరమేశ్వర్, మెరుగు వెంకటేష్ మరియు ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు. తమ విన్నపాన్ని పరిశీలించి తగిన న్యాయం చేయాలని వారు అధికారులను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular