•రహదారి భద్రతే జీవితానికి రక్షణ
•ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : అశోక్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి4
రాజీవ్ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఆదివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దుద్దెడ టోల్ ప్లాజా ఈజీఎస్ మేనేజర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఈజీఎస్ రూట్ పెట్రోలింగ్ బృందం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ ధరించాలని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు.మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆటోలు, ప్రైవేట్ వాహనాలు నిర్ణీత పరిమితికి మించిప్రయాణికులను ఎక్కించరాదన్నారు. విద్యార్థులు కూడా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ తమ కుటుంబ సభ్యులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఈజీఎస్ రూట్ పెట్రోలింగ్ ఆర్‌పీఓ కుమార్, హెల్పర్ శ్రీనివాస్, పైలట్ హరీష్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ రహదారి భద్రత మాసోత్సవాలు
RELATED ARTICLES

