మనప్రజాప్రతినిధి// సిద్దిపేటనియోజకవర్గం.జనవరి3
•పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జన్మదిన వేడుకలు
సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని పురస్కరించుకొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు E. సుజాత మాట్లాడుతూ, పూర్వకాలంలో విద్య కేవలం ధనవంతులకే పరిమితమై ఉండేదని, అటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు విద్య అందుబాటులోకి రావడానికి సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి అమోఘమని కొనియాడారు. ఆమె పోరాటం వల్లే నేటి సమాజంలో విద్యకు విస్తృత అవకాశాలు లభించాయని తెలిపారు.పాఠశాల AAPC ఛైర్మన్ కావ్య మాట్లాడుతూ, దళిత-పీడిత వర్గాలకు విద్యను చేరువ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే అని అన్నారు. “ఆడపిల్ల చదువు – అవనికి వెలుగు” అన్న భావనను ఆమె జీవితమే నిరూపించిందని, విద్యార్థులు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జనగాం శ్రీనివాస్, Ch. దేవరాజు తదితరులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

