Saturday, February 28, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్భోగి–సంక్రాంతి వేళ ఆధ్యాత్మిక సందేశం ఇచ్చిన ఎస్ సి వి నాయుడు

భోగి–సంక్రాంతి వేళ ఆధ్యాత్మిక సందేశం ఇచ్చిన ఎస్ సి వి నాయుడు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం,జనవరి14
శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు మాజీ శాసనసభ్యులు ఎస్ సి వి నాయుడు భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి, సుఖ సంతోషాలు,అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.భోగి, సంక్రాంతి, కనుమపండుగలు ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతి సంపదను కాపాడుకోవడం, పరులకు ఉపయోగపడే విధంగా జీవించడం అనే జీవన సత్యాలను బోధిస్తా యని తెలిపారు. హిందూ సనాతన ధర్మంలో జీవుడు ఉన్నత స్థితికి చేరాలంటే ప్రకృతిని ఆరాధిస్తూ, నిస్వార్థంగా మనిషికి మనిషి సహకరించుకుంటూ జీవించడమే పరమార్ధమని ఎస్ సి వి నాయుడు పేర్కొన్నారు.సకల సృష్టికి మూలకారకులైన విష్ణు, బ్రహ్మ, పరమేశ్వరులు జీవ తత్వాన్ని ప్రపంచానికి తెలియజేశారని అన్నారు. కామ తత్వాన్ని తొలగించుకుని, చెడు గుణాలను త్యజించి, సేవాగుణంతో ముందుకు సాగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుందన్నారు.ఆది దంపతులైన పార్వతీ–పరమేశ్వరుల అనుగ్రహంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతు లతో, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఎస్ సి వి నాయుడు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular