Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుభోగి వేడుకల్లో కాంచిట్ చౌరస్తా చిరు వ్యాపారులు

భోగి వేడుకల్లో కాంచిట్ చౌరస్తా చిరు వ్యాపారులు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జనవరి10
స్థానిక సిద్దిపేట పట్టణంలోని కాంచిట్ చౌరస్తా ప్రాంతంలో చిరు వ్యాపారులు, బట్టల దుకాణాల యజమానులు, వర్తక వ్యాపారులు కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా భోగిమంటలను ఘనంగా నిర్వహించారు.చల్లని వాతావరణంలో భోగిమంటల చుట్టూ గుమి గూడిన చిరు వ్యాపారులు ఒకరినొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ వ్యాపార అనుభవాలు, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఐక్యతను చాటుకున్నారు.కాంచిట్ చౌరస్తా పరిధిలోని బట్టల షాపు యజమానులు, చిరు వ్యాపారులు కలిసి భోగిమంటలు కాస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular