మనప్రజాప్రతినిధి//నర్సాపూర్:
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ ఆకుల సంతోష నవీన్ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించడమే కాకుండా మురుగు కాలువల్లో పూడిక తీయించి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రోడ్డు పక్కన పిచ్చి మొక్కలను తొలగించడం వాటర్ ట్యాంక్ శుభ్రంగా చేయించడం దోమల నివారణకు పిచికారి చేయడం. వీధి దీపాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రుద్రారం గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆకుల సంతోష నవీన్ యువజన సంఘాలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

