Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమార్కండేయ జయంతోత్సవాలకు టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డికి ఆహ్వానం..

మార్కండేయ జయంతోత్సవాలకు టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డికి ఆహ్వానం..

📰 Generate e-Paper Clip

సదాశివపేట,జనవరి20(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ ఈశ్వర మార్కండేయ స్వామి ఆలయంలో జరగనున్న మార్కండేయ జయంతోత్సవాలకు టీజీఐఐసీ చైర్‌పర్సన్ గౌ. శ్రీమతి తూర్పు నిర్మల జగ్గారెడ్డికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అధికారికంగా ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గుజ్జారి వెంకన్న (లడ్డు) మాట్లాడుతూ, బుధవారం జరగనున్న మార్కండేయ జయంతోత్సవాలకు నిర్మల జగ్గారెడ్డిని ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మార్కండేయ జయంతోత్సవాలను భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.ఈ ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పద్మశాలి మహిళలందరూ కలశాల ఊరేగింపులో పాల్గొని ఉత్సవాలకు శోభ చేకూర్చాలని పిలుపునిచ్చారు. అలాగే భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ గౌ. శ్రీమతి తూర్పు నిర్మల జగ్గారెడ్డి,సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి,సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి చేర్యాల ఆంజనేయులు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు,
మాజీ కౌన్సిలర్లు పిల్లొడి విశ్వనాథం, నాగరాజు గౌడ్, రాయిపాడ్ రమేష్,ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్,తుకారాం, బిట్ల ప్రేమ్ కుమార్, నాగేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular