Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణమాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి                                             

మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి                                             

📰 Generate e-Paper Clip

జహీరాబాద్ జనవరి 4 (మనప్రజాప్రతినిధి)

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై నరోత్తం కార్యాలయంలో జనవరి 3వ తేదీ 195వ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా వై నరోత్తం సతీమణి  వై పుష్పరాణి ఉపాధ్యాయురాలకు శాలువలతో సత్కరించి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై నరోత్తం మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహారాష్ట్రంలోని సతారా జిల్లా నయగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3వ తేదీన ఒక రైతు కుటుంబంలో జన్మించారు  ఆమె తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు పూలే తో 1840 లొ వివాహమాడింది. ఆమె భారత దేశంలో మొట్టమొదట మహిళ ఉపాధ్యాయురాలుగా చరిత్రకెక్కింది ఆమె తన భర్తతో కలిసి1848 జనవరి 1వ తేదీన పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాల ప్రారంభించిది మహిళలకు విద్య నేర్పిన మొదటి పంతులమ్మ సావిత్రిబాయి పూలే వారి స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని అన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular