మనప్రజాప్రతినిధి//మనకొండూరు,జనవరి12:
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఇల్లంతకుంట మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ నిర్మాణ్ అభియాన్ మండల కార్యశాలలో బిజెపి నేత గుజ్జ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుజ్జ శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన, పల్లెల నలుమూలల విస్తరించి ప్రజల హృదయాల్లో బలంగా నిలిచిందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు.బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్చార్జీలు, ఎంపీటీసీ ప్రభారీలు, మండల అధ్యక్షులు అందరూ పార్టీ కోసం సమయం కేటాయించి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే మండల పరిషత్, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపేందుకు కిందిస్థాయి కార్యకర్త నుంచి పైస్థాయి నాయకత్వం వరకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు స్పష్టంగా వివరించ డం మన బాధ్యత అని, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారులను వ్యక్తిగతంగా కలిసి వారి అభిప్రాయాల ను సేకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బత్తిని స్వామి, సీనియర్ నాయకులు రోడ్ల మధుసూదన్, మేకల మల్లేశం, అమ్ముల అశోక్, మామిడి హరీష్, కొలనూరు ముత్తవ్వ, మండల నాయకులు గుంటి మహేష్, బూత్ అధ్యక్షులు, ఎంపీటీసీ ప్రభారీలు, శక్తి కేంద్రం ఇన్చార్జీలు, వార్డు సభ్యులు, జిల్లా స్థాయి కార్యకర్తలు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
బూత్ స్థాయి నుంచే బిజెపి గెలుపు ప్రస్థానం: గుజ్జ శ్రీనివాస్
RELATED ARTICLES

