ప్రారంభించిన కలెక్టర్ అఖిల్ యాదవ్, ప్రతాప్ రెడ్డి
కొండపాక,జనవరి8(మనప్రజాప్రతినిధి):
కొండపాక గ్రామంలో అనంతుల ప్రశాంత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మాజీ ఎంపీపీ అనంతుల శారద స్మారకార్థం నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కేంద్రానికి చెందిన ఐఏఎస్ అధికారి బుద్ధి అఖిల్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి హాజరై క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని సూచించారు.అనంతుల శారద గ్రామాభివృద్ధికి చేసిన సేవలను పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రశాంత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సంజీవరెడ్డి, సర్పంచులు నవీన్, మిద్దె శివకుమార్, జ్యోతి బాలస్వామి, సుజాత అశోక్, యాదవ ఎల్లం, కోడెల రవీందర్, గాలి బాలయ్య, సీనియర్ నాయకు లు జైపాల్ రెడ్డి, బాల బ్రహ్మం, ఎల్లం, అంబటిభానుచందర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
RELATED ARTICLES

