Tuesday, March 17, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్పరశురామేశ్వర స్వామి సన్నిధిలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక దర్శనం

పరశురామేశ్వర స్వామి సన్నిధిలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక దర్శనం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్31
ఏర్పేడు మండల పరిధిలోని ప్రాచీన క్షేత్రమైన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం బుధవారం భక్తుల కిటకిటలతో పునీతమైంది. త్రేతాయుగం నుంచి పూజలందుకుంటూ, అపార మహిమలు కలిగిన స్వయంభూ క్షేత్రంగా పేరొందిన ఈ దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు. పరశురామేశ్వర స్వామి దర్శనం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని, శాంతి–సౌభాగ్యాలు కలుగుతాయని స్థానికుల విశ్వాసం.ఈ సందర్భంగా దేవాలయానికి సంబంధించిన నూతనంగా ఏర్పాటు చేసిన “శ్రీ ఆనందవల్లి పరశురామేశ్వర స్వామి భక్తి ఛానల్” యూట్యూబ్ ఛానల్‌ను ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో, కార్యనిర్వహణ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు అధికారికంగా ప్రారంభించా రు. ఈ భక్తి ఛానల్ ద్వారా స్వామివారి నిత్య పూజలు, ప్రత్యేక ఉత్సవాలు, క్షేత్ర మహత్యం భక్తులకు ప్రత్యక్షంగా చేరనుంది.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీవో, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆలయ చైర్మన్ బత్తలగిరి నాయుడు, పాలకమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నాగరాజు నాయుడు, ధనంజయులు నాయుడు, బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే గుడిమల్లం గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
👉 ఇంకా

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular