Monday, March 2, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలునీటి కోసం పోరాటానికి ముగింపు – చిరు చొరవతో 5 బోర్లు

నీటి కోసం పోరాటానికి ముగింపు – చిరు చొరవతో 5 బోర్లు

📰 Generate e-Paper Clip

రూ.7లక్షల50వేల వ్యయంతో శివపురి కాలనీలో బోర్లు-ప్రజల్లో హర్షం
వేసవిలో తాగునీటి ఎద్దడికి చెక్ పెట్టినడైరెక్టర్”చిరు చొరవ
వార్డు నెంబర్–2లో సొంత నిధులతో చేపట్టిన తాగునీటి పనులు
మహిళల నీటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం
ఏళ్ల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందంటున్న కాలనీ వాసులు
ప్రజాసమస్యలపై స్పందించిముందుకు వచ్చినమార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు

సదాశివపేట,జనవరి16(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట పట్టణంలోని వార్డు నెంబర్–2 శివపురి కాలనీలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు శాశ్వత పరిష్కారం చూపించారు. తన సొంత నిధులతో రూ.7 లక్షల 50 వేల వ్యయంతో 5 బోర్లు వేయించి ప్రజల మన్ననలు పొందారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ చిరు మాట్లాడుతూ, శివపురి కాలనీలో ప్రజలు ముఖ్యంగా వేసవికాలంలో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నా రని, ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని తన వ్యక్తిగత ఖర్చులతో బోర్లు వేయిస్తున్నానని తెలిపారు. ఇకపై కాలనీలోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చారు.ప్రత్యేకంగా మహిళలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలను తొలగించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.వార్డు ప్రజలు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న తమకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు సొంత డబ్బులతో బోర్లు వేయించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇక నుంచి తమ కాలనీలో నీటి సమస్య పూర్తిగా తొలగిపోయిందని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మనీ, లాజర్, రాహుల్, అశోక్, మనయ్య, షేక్ పాషా, యాదగిరి, తీయర్, జీవన్, నరసింహ, జగతి, రాము, కృష్ణ, సంపత్, శేఖర్, సామెల్, చంద్రయ్య, యాదయ్య, అనిల్ గౌడ్, రాజు, వరుణ్, లక్ష్మయ్య, మల్లేశం గౌడ్, ఆనందం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular