📄 ePaper
Sunday, June 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిరిసిల్ల పురపాలక తుది ఓటర్ల జాబితా విడుదల..

సిరిసిల్ల పురపాలక తుది ఓటర్ల జాబితా విడుదల..

📰 Generate e-Paper Clip

మొత్తం39వార్డులకు సంబంధించినఓటర్ల వివరాలు 117పోలింగ్ కేంద్రాల్లోఅందుబాటులో
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,జనవరి16
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిరిసిల్ల పురపాలక పరిధిలోని తుది ఓటర్ల జాబితాను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా,మున్సిపాలిటీ లోని మొత్తం 39వార్డులకు సంబంధించిన ఓటర్ల వివరాలను ఈ జాబితాలో పొందుపరచారు.ప్రతి వార్డులో ఓటర్ల సంఖ్యను పరిగణ నలోకి తీసుకుని, 3 కేంద్రాల చొప్పున మొత్తం 117 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ తుది జాబితా ప్రజల పరిశీలన కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచబడింది.
ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులకు జాబితా ప్రతులు అందజేయబడ్డాయి. ఓటర్లు తమ పేరు, వార్డు వివరాలు, కేటాయించిన పోలింగ్ కేంద్రం వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి.పురపాలక అధికారులు, అర్హులైన ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఓటు హక్కుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే, తమ వివరాల్లో ఏవైనా మార్పులు లేదా చేర్పులు ఉంటే సంబంధిత కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular