📄 ePaper
Sunday, June 28, 2026
Homeతెలంగాణవైభవంగా హిందూ సమ్మేళనం

వైభవంగా హిందూ సమ్మేళనం

📰 Generate e-Paper Clip

గుంటూరుజనవరి 4 (మనప్రజాప్రతినిధి):

ఆర్ అగ్రహారం శ్రీ రామనామ క్షేత్రం ప్రాంగణంలో ఆదివారం హిందూ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఈ సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అవ్వారు శ్రీనివాసరావు, బిజెపి నాయకులు అప్పిశెట్టి రంగారావు, ప్రోగ్రాం కన్వీనర్ భవిరిశెట్టి మల్లికార్జునరావు, శివశక్తి ఫౌండర్ కరుణాకరన్ సుగన్, విరుపాక్షనంద స్వామీజీ,సుదర్శన చారి,ప్రియా చౌదరి పాల్గొన్నారు.హిందువులంతా హైందవమతంపై ప్రేమను, మమకారాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఇంటిలోనే కులమని గడప దాటితే హిందువులమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సమాజ హితాన్ని కాంక్షిస్తూ హిందూ సమ్మేళనం నిర్వహించడం జరిగిందన్నారు.ఐక్యత తోనే జాతి వికాసం సాధ్యమన్నారు.ఈ హిందూ సమ్మేళనానికి పరిసర ప్రాంత కాలనీయులైన కెవిపి కాలనీ, శ్రీనివాసరావు తోట, సంపత్ నగర్, ఆడప బజార్ ,నల్లచెరువు తదితర ప్రాంతాల నుంచి హైందవ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామీజీల అనుగ్రహం పొందారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular