సదాశివపేటలో టోర్నమెంట్‌ను ప్రారంభించిన సిడిసిచైర్మన్ గడీల రామిరెడ్డి,సీఐవెంకటేశం
సదాశివపేట,జనవరి11(మనప్రజాప్రతినిధి):
కీ.శే. స్వర్గీయ పప్పతి నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ గారి స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం సదాశివపేటలో ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌ను సిడిసి చైర్మన్ గడీల రామిరెడ్డి, సదాశివపేట సీఐ వెంకటేశం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిహెచ్ సిద్ధన్న, సర్పంచులు ఆశి రెడ్డి, బలరాం, శ్రీనివాస్ రాజు, శ్రీను పాల్గొన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు పిఎసిఎస్ మాజీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు టి. రాజు, సురేష్, ఎం. ఈశ్వర్, చౌటు నవీన్, సామెల్, బీసీ నాయకులు మల్లేశం, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో వెల్టూర్ మరియు ముబారకాపూర్ గ్రామాలకు చెందిన మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఫైనల్ మ్యాచ్ జనవరి 16వ తేదీన నిర్వహించి టోర్నమెంట్‌ను ముగించనున్నారు.విజేతలకు ఆకర్షణీయ మైన బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతిగా రూ.40,000, రెండో బహుమతిగా రూ.20,000, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు రూ.5,000 అందజేయనున్నారు. అదేవిధంగా ప్రతి మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా రూ.500 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, స్వర్గీయ పప్పతి నర్సింహారెడ్డి గారు గ్రామాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతను క్రీడల వైపు ప్రోత్సహించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

