•ఇల్లంతకుంట మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించిన గణతంత్రదినోత్సవవేడుకలు..
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.జనవరి26
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయ ఆవరణలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, రాజ్యాంగ విలువలు, దేశభక్తి ప్రాధాన్యతపై నాయకులుప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మ్యాకల మల్లేశం, జిల్లా కౌన్సిల్ మెంబర్ బత్తిని సాయ గౌడ్, జిల్లా నాయకులు దేశెట్టి శ్రీనివాస్, నాగసముద్రల సంతోష్, కొలనూరు ముత్తవ్వ, మండల నాయకులు పున్ని సంపత్, లంకోజు చంద్రం, భూత్ అధ్యక్షుడు కూనబొయిన బాలరాజు, నాయకులు కూనబొయిన పరశురాం, కూనబొయిన కార్తీక్, ప్రశాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు ప్రజల్లో దేశభక్తి భావనను మరింత బలోపేతం చేసేలా సాగింది.
బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ
RELATED ARTICLES

