•పంచాయితీ నూతన ప్రజా ప్రతినిధులకు పాఠశాల సిబ్బంది ఘన సన్మానం
కొండపాక మండలం(మనప్రజాప్రతినిధి):జనవరి10
ఇటీవల జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో తిమ్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో ఘన విజయం సాధించిన సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘన సన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కొండపాక మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాలువలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు విద్యారంగం అభివృద్ధికి నూతన పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.అనంతరం సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధితో పాటు పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అవసరమైన అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని తెలిపారు.
తిమ్మారెడ్డిపల్లి నూతన పంచాయతీ పాలకవర్గానికి ఘన సత్కారం
RELATED ARTICLES

