Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుబీసీ భవనంలో పద్మశాలి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

బీసీ భవనంలో పద్మశాలి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మిర్యాలగూడ.జనవరి11
మిర్యాలగూడ పట్టణంలోని బీసీ భవనంలో పద్మశాలి సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్‌ను సంఘ అధ్యక్షులు పిల్లలమర్రి రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు పిల్లలమర్రి రవికుమార్ మాట్లాడుతూ, పద్మశాలి హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల ఫలాలు పద్మశాలి కుల కుటుంబాలందరికీ అందేలా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్యాలెండర్ ఆవిష్కరణకు హాజరైన బీసీ బంధువులకు, పద్మశాలి కుటుంబ సభ్యులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలోప్రధాన కార్యదర్శి రావిరాల ప్రకాష్,వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టిపోలు రమేష్,స్టీరింగ్ కమిటీ సభ్యులు రాపోలు సత్యనారాయణ, చెరువుపల్లి పట్టాభి,ఉపాధ్యక్షులు నక్క సత్యం, దయాకర్, కిరణ్, సతీష్,కార్యదర్శులు పున్న శ్రీనివాస్, కర్నాటి ఆంజనేయులు, గంజి బిక్షం,కోశాధికారి చిలుకూరి అశోక్, జెలా శంకరయ్య,బీసీ జేఏసీ నాయకులు దాసరాజు, జయరాజు, లింగంపల్లి, చిరంజీవి, చేగొండి మురళి యాదవ్, జంజీరాల, నాగరాజు, సిరిసిల్ల శ్రీనివాస్, దేవులపల్లి శంకర్, సైదులు, పోశం, పూర్ణచందర్, ఆంజనేయులు, గుర్రం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular