Friday, February 27, 2026
ads
Homeతెలంగాణఅధిక వడ్డీలతో పేదవాడి నడ్డి విరుస్తున్న అనుమతి లేని వడ్డీ వ్యాపారస్తులు

అధిక వడ్డీలతో పేదవాడి నడ్డి విరుస్తున్న అనుమతి లేని వడ్డీ వ్యాపారస్తులు

📰 Generate e-Paper Clip

ప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా డిసెంబర్ 3:

తిరుపతి జిల్లా ఏర్పేడు మండల పరిధిలో అధిక వడ్డీల పేరుతో పేద ప్రజల రక్తాన్ని జలగల్లా తాగుతున్న వడ్డీ వ్యాపారస్తులు .
తిరుపతి జిల్లాలో ఏర్పేడు మండలంలో ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో కొత్తగా వడ్డీ దందా తెగ జోరుగా సాగుతుంది.
సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్లే వీళ్ళ టార్గెట్. వాళ్ల అవసరాలు ఆసరాగా తీసుకొని వందరూపాయలకి సుమారుగా 20 నుండి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్న వైనం. అయినా కూడా కొంతమంది మధ్యతరగతి వ్యక్తులు బయట చెప్పుకోలేక చెప్పుకుంటే వారి యొక్క పరువు పోతుందని మీరు విధించిన ఆంక్షలు కట్టుబడి అధిక వడ్డీలు కడుతూ వారి యొక్క కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న వైనం. వీళ్ళు ఇచ్చే వడ్డీలలో వారానికో వడ్డీ. రోజువారి వడ్డీ. అదేవిధంగా నెలవడ్డీ. 15 రోజులకు వడ్డీ. కట్టించుకుంటున్నారు. ఒకానొక సందర్భంలో ఆ యొక్క పేదవాడి పరిస్థితి బాగాలేక కట్టలేనీ పరిస్థితిలో వారి వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలను కావచ్చు వారి ఇంటి వద్ద విలువైన వస్తువులు కూడా స్వాధీన పరుచుకుంటున్న వైనం. ఇవన్నీ జరుగుతున్న పేద మధ్య తరగతి వారు పోలీస్ స్టేషన్ వైపు కూడా  కన్నెత్తి  చూడలేని వైనం ఎందుకంటే అక్కడికి వెళితే మిమ్మల్ని చంపేస్తామని బెదిరింపులు పాల్పడుతున్న వడ్డీ వ్యాపారస్తులు. అనుమతి లేని వడ్డీ వ్యాపారుస్తుల చేత నలిగిపోవడమే కాకుండా అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటి దగ్గర లేని సమయంలో వారి యొక్క  కుటుంబ సభ్యులను బెదిరిస్తున్న వైనం.అప్పు తీసుకున్న వ్యక్తి వీళ్ళని ప్రాధేయపడిన కూడా వదిలే ప్రసక్తే లేదని వీళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మా గురించి మీకు తెలియదు మా దగ్గర రౌడీయిజం చేయడానికి సిద్ధంగా ఉన్న మనుషులు కూడా ఉన్నారు. అలాగా ఉంటేనే మేము వడ్డీ వ్యాపారం చేస్తాం చేయగలం మీ చేతనైన చోట మీరు వెళ్లి చెప్పుకోవచ్చని గర్వంగా చెప్పుకుంటున్నారు… మీకు ఎంతమంది ఉన్నా కూడా మేము లెక్క చేసే పరిస్థితి లేదని అప్పు తీసుకున్న వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేసి వారి దగ్గర నుంచి ఎంటి చెక్కులు కావచ్చు అదేవిధంగా ప్రాంసరీ నోట్లు కావచ్చు కాళీ వాటిపై సంతకాలు చేయించుకుని వారిని భయభ్రాంతులకు గురిచేసి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న కూడా అప్పు తీసుకున్న వాళ్లు జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి భయపడుతున్న వాళ్లు కొంతమంది అయితే  సిగ్గుపడుతున్న వాళ్లు కొంతమంది అయితే వీరు భారీని పడి చనిపోతున్నవారు చాలామంది ఉన్నారు. ఈ విషయంపై ప్రత్యేకతనంతో సాక్షాధారాలతో సహా మీ ముందుకు వస్తున్న ప్రజాప్రతినిధి దినపత్రిక వేచి చూద్దాం ఇప్పటికైనా వడ్డీ వ్యాపారిస్తుల బారిన పడినవాళ్లు బయటకు వచ్చి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోకపోతే ఇలాగే కొన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఏర్పేడు మండలంలో దగ్గర్లో చూస్తారని ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నా మీ ప్రజా ప్రతినిధి తెలుగు దినపత్రిక ప్రత్యేక కథనంతో త్వరలో మీ ముందుకు సాక్షాధారాలతో సహా.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular